Wednesday, January 22, 2025

జిడిపిలో యూట్యూబ్ క్రియేటర్ల వాటా రూ.10 వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ క్రియెటర్ల ఆదాయం 2021 భారతీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో దాదాపు రూ.10 వేల కోట్లు ఉందని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక తెలిపింది. దేశంలోని 7.50 లక్షల మందికి పైగా పూర్తి స్థాయి ఉద్యోగులకు సమానంగా గూగుల్ ఉపాధిని కల్పించింది.

2020లో దేశ జిడిపిలో యూట్యూబ్ క్రియేటర్ల ఆదాయం వాటా రూ.6,800 కోట్లు ఉండగా, ఇది 6.83 లక్షల మందికి సమానంగా ఉపాధిని కల్పించింది. ఈ సర్వేలో 5,633 మంది యూట్యూబ్ క్రియేటర్లు అన్ని రకాలవారు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News