నేటి యువత షేర్ మార్కెట్‌లో చేస్తున్న తప్పిదాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే అవగాహ న, ఆలోచనలు లేక విషయంపై పట్టు సంపూర్ణంగా లేకపోవడం ఆపై చేతులు కాల్చుకోవడం జరుగు తుంది. అనేక విభాగాల్లో యువ పెట్టుబడిదారులు షేర్ మార్కెట్లో స్థిరత్వం కోల్పోవడం జరుగుతుంది. షేర్ మార్కెట్‌పై కనీస అవగాహన లేకపోవడం అందుకు ప్రధాన కారణం.
ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిందనే భావనతో నేటి కాలంలో ప్రతి వ్యక్తి ఊహ నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే విస్తృత ప్రపంచంలో అనేక విషయాలపై ఒక వ్యక్తి సమగ్రమైనటువంటి విషయాన్ని గ్రహించే అవకాశాలు అనేకంగా ఉన్నాయి. ఏ మార్గం అయితే తనను ఒక ఉన్నత మార్గంలో ప్రయాణింప చేస్తుందో అనేది మాత్రం తన సొంత నిర్ణయంగా మారుతుంది. నిత్య అన్వేషిగా అనేకమైన విషయాలపై వ్యక్తి తన నూతన ఆవిష్కరణకు చేరువ కావాలని ప్రయత్నం జరుగుతుంది. ఆ దిశగా యువత అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఏదైన ఒక దేశ సంపద ఒక కోణంలో పరిశీలిస్తే అది యువత మేధస్సే ప్రధానం అని చెప్పవచ్చు.
మరి కొందరు యువత ఏ మార్గంలో ప్రయాణిస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం. ఆశ ఆశ ఆశ… కష్టించి పని చేయడం ద్వారానే ఒక నిర్మాణాత్మకమైన స్థానాన్ని సాధించుకోవడానికి అవకాశం భవిష్యత్‌లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ విషయాన్ని గ్రహించక కొందరు యువత షేర్ మార్కెట్‌లో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆచరిస్తున్న విధానం ఒక కోణంలో చూస్తే తాత్కాలిక ఆలోచనలు, పోటీ ప్రపంచంలో వారిని నిత్యం వెంటాడుతున్న అనేక సంఘటనలు నిజాన్ని తెలుసుకోలేనటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు మూలం, దాని గత, భవిష్యత్తు పరిణామక్రమంపై అవగాహన సరిగా లేని కారణంగా అనేకమంది ఒక సందిగ్ధంలో కొట్టుమిట్టాడడం ఒక కారణం. దానికి తోడు ఆకర్షణీయమైన ప్రచార ప్రకటనలు, సామాజిక మాధ్యమాలు అందిస్తున్న విస్తృతమైన పోస్టింగుల ప్రభావం ప్రధానంగా ఉన్నది.
అవును, నేటి యువత అనేక మంది షేర్ మార్కెట్‌లో చేస్తున్న తప్పిదాలు వారి భవిష్యత్ మార్గాలను ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే అవగాహన, ఆలోచనలు లేక విషయంపై పట్టు సంపూర్ణంగా లేకపోవడం ఆపై చేతులు కాల్చుకోవడం జరుగుతుంది. అనేక విభాగాల్లో యువ పెట్టుబడిదారులు షేర్ మార్కెట్లో స్థిరత్వం కోల్పోవడం జరుగుతుంది. షేర్ మార్కెట్‌పై కనీస అవగాహన లేకపోవడం అందుకు ప్రధాన కారణం. ప్రపంచంలో పెట్టుబడి ప్రధాన మార్గాలను ఒక్కసారి పరిశీలిస్తే భూములు (రియల్ ఎస్టేట్), వ్యాపారం ఒక భాగం అయితే తమ పెట్టుబడితో సంపదను పెంచుకునే మరో మార్గం షేర్ మార్కెట్.
ఉత్సాహవంతంగా యువత చేస్తున్న షేర్ మార్కెట్ వ్యాపారంలో వారు ప్రవేశించిన సమయంలో బుల్ మార్కెట్ ప్రభావంతో మరిన్ని అడుగులు ముందుకు వేస్తారు. ఆ సమయం మరింత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తుంది. కానీ కష్టతరమైన కనిష్ట స్థాయిలో మార్కెట్ అనుకూల ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి లేకపోవడం ప్రధాన కారణంగా మారింది. మార్కెట్లో అప్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుందో.. డౌన్ ట్రెండ్ కూడా ఉంటుందని విస్మరించడం గమనార్హం. సొంత వ్యాపారంలో గాని తెలిసిన వారికి డబ్బుని రుణంగా ఇచ్చే సమయంలో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించకపోవడం జరుగుతుంది. ఫ్యూచర్స్‌లో అధిక మొత్తాల పెట్టుబడుల షేర్లను తక్కువ మొత్తానికి ఇన్వెస్టర్లకు అందించే వెసులుబాటు మార్గాలను కల్పిస్తున్నవి. ఇవి డబ్బులు సంపాదించడానికి కాకుండా డబ్బులు కాపాడుకోవడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ షేర్‌లలో పెట్టిన పెట్టుబడి లో వచ్చే నష్టాలను అధిగమించడానికి వినియోగించుకునే మార్గంలో ఆప్షన్స్‌లో ఉన్న పెట్టుబడి అమ్మకాల ద్వారా సదరు పెట్టుబడిదారుడు స్థిరత్వాన్ని సంపాదించుకోవచ్చు.
ఇది మార్కెట్‌పై అవగాహన ఉన్నప్పుడే జరుగుతుంది. కంపెనీల పెట్టుబడులను షేర్ మార్కెట్లో నడవడికను గమనించాలి. ఒక సంవత్సరంలో కనిష్ట, గరిష్ట హెచ్చుతగ్గులను అవి తాత్కాలికమా..! లేక స్థిరత్వంతో మనుగడ కొనసాగుతున్నాయా..! అనే వాటిపై వివిధ కోణాలలో పరిశీలించాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్, పి ఇ రేషియో, ఇపిఎస్, ఆర్‌ఎస్‌ఐ ఇకపోతే ఐదు సంవత్సరాల డేటాతో పాటుగా కంపెనీ ఆస్తులు అప్పులు, లాభనష్టాల పట్టికలను గమనించాలి. ఏదేని ఒక కంపెనీ డివిడెండ్ ఇస్తుంది అంటే అది కంపెనీ లాభాలలో నుంచి వచ్చిన ప్రధాన మొత్తంగా భావించాలి. అలాంటి కంపెనీల షేర్లు కొన్ని మార్కెట్ ప్రభావాల పరిస్థితుల సందర్భంలో కనిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఆ షేర్లు కొనుక్కున్న పెట్టుబడిదారులు కొంతవరకు లాభసాటి మార్గంలో వెళుతున్నారని చెప్పవచ్చు. ఏదిఏమైనప్పటికీ షేర్ మార్కెట్‌పై ఒక నిర్మాణాత్మకమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు, మార్కెట్‌ను ఇప్పటికప్పుడు పరిశీలిస్తూ మార్కెట్ హెచ్చుతగ్గులను చాకచక్యంగా అధిగమిస్తూ, ఒక కోణంలో దీర్ఘకాలికంగా పెట్టుబడులను కేంద్రీకరిస్తూ ముందుకు సాగినప్పుడే అనుకున్న ఫలితాలు సాధిస్తారు.
చిటికెన కిరణ్ కుమార్
9490841284