Tuesday, January 21, 2025

అసంతృప్త నేతలకు షర్మిల బుజ్జగింపులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీలో అసంతృప్త నేతల పట్ల ఆ పార్టీ అధినేత షర్మిల ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్దులను పోటీకి నిలపకుండా, ఎన్నికల బరి నుంచి తప్పుకున్న షర్మిల కాంగ్రెస్‌పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించింది. పార్టీ యంత్రాంగానికి కూడా కాంగ్రెస్ అభ్యర్ధులు విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేసింది. అయితే షర్మిల తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీలోనే కొందరు ముఖ్యనేతలు అసంతృప్తితో ఉన్నారు. మరికొందరూ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు.

పార్టీ నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్న నేతలను పిలిపించుకుంటున్న షర్మిల వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్‌ను గురువారం పార్టీ కార్యాలయానికి పిలిపించుకున్న షర్మిల కామారెడ్డిలో రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పోటీగా చేయవద్దని, ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని సూచించారు. పార్టీ అధినేత్రి ఆదేశాల మేరకు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేస్తామని నీలం సుధాకర్ ప్రకటించారు. మిగిలిన మరికొందరు నేతలను కూడా బుజ్జగించేందుకు షర్మిల చకచకా చర్యలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News