Wednesday, January 22, 2025

వైసీపీలో వైఎస్ఆర్ అంటే ఆ ముగ్గురే: షర్మిల

- Advertisement -
- Advertisement -

వైసీపీలో వైఎస్ఆర్ లేరు. ఆ పార్టీలో వైఎస్ఆర్ అంటే… వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి మాత్రమేనని షర్మిల అని వ్యంగ్యంగా అన్నారు. ఒంగోలులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా నిర్మించారు. కానీ దాని నిర్వహణ కూడా వైసీపీ ప్రభుత్వానికి చేతకావడం లేదు. గేట్లు ఊడిపోయినా పట్టించుకోవటం లేదు’ అని ధ్వజమెత్తారు. తాను ఏపీకి ప్రత్యేక హోదాకోసం పోరాడుతుంటే వైసీపీ వాళ్లు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు న్యాయం చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల చెప్పుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News