Friday, January 24, 2025

బిజేపీతో వైసీపీ కుమ్మక్కు: షర్మిల

- Advertisement -
- Advertisement -

విశాఖ ఉక్కును సర్వనాశనం చేస్తుంటే రాష్ట్రంలో టీడీపీ, వైసీపి పార్టీలు ఏం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందనీ, అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదాపై పోరాడటం మరచిపోయారని ఆమె విమర్శించారు. పాలకపక్షం, ప్రతిపక్షం బిజేపీతో మిలాఖత్ అయ్యాయన్నారు. ఆమె బుధవారం విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి… కాంగ్రెస్ రావాలి అని ఆమె నినదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News