Friday, January 10, 2025

వైఎస్ఆర్ టిపిని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషం: షర్మిల

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వైఎస్ఆర్ టిపిని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేత షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వైటిపిని వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేశారు. భర్త అనిల్‌తో పాటు ఎఐసిసి కార్యాలయానికి వైఎస్ షర్మిల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్‌లో వైటిపి ఒక భాగమన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితమంతా కాంగ్రెస్ కోసమే పని చేశారని గుర్తు చేశారు. తాను మానాన్న అడుగుజాడల్లోనే నడుస్తానని షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం మా నాన్న కల అని చెప్పారు. దేశంలో అన్ని వర్గాలనే ఏకం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌లో ఏ బాధ్యత అప్పగించిన తన శక్తి మేరకు పని చేస్తానని వివరించారు. దేశంలో కాంగ్రెస్ అతిపెద్ద సెక్కులర్ పార్టీ అని, సెక్యూలర్ పార్టీలు అధికారంలో లేకుంటే దేశం గతి మణిపూర్ పరిస్థితే ఏర్పడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News