Tuesday, December 24, 2024

జగన్ ఇంటికి షర్మిల

- Advertisement -
- Advertisement -

అన్నా వదినలకు ఆహ్వానం
మన తెలంగాణ/హైదరాబాద్ : వైఎస్ షర్మిల విజయవాడకు వచ్చారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసా నికి చేరుకున్నారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుమారుడు కూడా వెంట ఉన్నారు. తన కుమారుడి నిశ్చితార్ధ ఆహ్వాన పత్రికను తన సోదరుడు జగన్ కు అందచేయడానికి వచ్చారు. వదిన భారతిని కలసి నిశ్చితార్ధానికి రావాలని ఆహ్వానించనున్నారు. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి తో ప్రియా అట్లూరి తో నిశ్చితార్థం జరగనున్న నేపథ్యంలో ఆమె ప్రత్యేకంగా విజయవాడకు వచ్చారు. షర్మిలను వైఎస్ జగన్ సాదరంగా తన ఇంటి లోకి ఆహ్వానించారు. ఈ నెల 18వ తేదీన రాజారెడ్డి నిశ్చితార్ధం జరగనుంది. వచ్చేనెల 17 వతేదీన వివాహం జరగనుంది. అయితే సుదీర్ఘకాలం తర్వాత వైఎస్ షర్మిల తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరూ గత కొంత కాలంగా రాజకీయంగా వేర్వేరు దారుల్లో పయనిస్తుండటంతో ఈ భేటీ మరింత ఆసక్తికరంగా మారింది. వివాహానికి అందరినీ ఆహ్వానించడానికే ఇక్కడకు వచ్చానని షర్మిల వెల్లడించారు.

ఆర్కే హడావుడి

వైఎస్ షర్మిల, వారి కుటుంబ సభ్యులకు ఎయిర్ పోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని సిఎం జగన్ నివాసానికి షర్మిల బయల్దేరి వెళ్లారు. వైఎస్ షర్మిల కాన్వాయ్ జగన్ క్యాంప్ ఆఫీస్‌లోనికి వెళ్లిన కొద్ది నిమిషాలకు మంగళగిరి ఎంఎల్‌ఎ ఆళ్ల రామక్రిష్ణారెడ్డి కూడా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయన్ని చుట్టుముట్టగా గురువారం షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, ఆమె ఎపి కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే తాను కూడా కాంగ్రెస్‌లో చేరతానని ఆర్కే స్పష్టం చేశారు. ఆ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ లైన్ లోనే వెళ్తానని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News