Monday, December 23, 2024

బర్త్ డే విషెస్… కుమారుడితో షర్మిల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్తగా వైఎస్‌ఆర్‌టిపి అనే పార్టీ  పెట్టి పాదయాత్ర చేస్తున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ రెండు తెలుగు రాష్ట్రాలో గొప్ప మత ప్రచారకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. షర్మిల- అనిల్ సంతానం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. తాజాగా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డితో దిగిన ఫోటోను షర్మిల సోషల్ మీడియాలో షేర్ చేసింది. షర్మిలకు ఇంత పెద్ద కుమారుడు ఉన్నాడా? అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వైఎస్ రాజారెడ్డి ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు. రాజా జన్మదినం సందర్భంగా షర్మిల విషెస్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అచ్చం హీరోలాగా ఉన్నాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. షర్మిల కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడా? లేక సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతాడా? అనేది వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News