Monday, December 23, 2024

దొంగలు సిఎంలు కాకూడదు: షర్మిల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు  ప్రకటించిన వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని దొంగ అని తాను అనడం లేదనీ, తనపై ఉన్న కేసులు కొట్టేయమంటూ రేవంత్ కోరితే, సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. అన్ని పార్టీలలోనూ దొంగలుంటారనీ, కానీ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదనీ ఆమె అన్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఆమె విలేఖరులతో మాట్లాడారు. ప్రజల కోసమే తాము తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనటం లేదని షర్మిల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ఆర్ టిపితో తమకు ఎలాంటి సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు ఏ సంబంధం ఉందని తన గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News