Wednesday, January 22, 2025

ఉమ్మడి పోరాటం చేద్దాం రండి: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రపతి పాలనకోసం ఉమ్మడి పోరాటం చేద్దాం కలిసిరండి అని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు.అఖిలపక్షంగా ఢిల్లీవెళ్లి రాష్ట్రపతిని కలిసి సర్కారును బర్తరఫ్ చేయాల్సిన అవసరాన్ని తెలియచేద్దామని సూచించారు. రాష్ట్రంలో అప్రకటిత పరిస్థితి ఏర్పడిందని , ప్రశ్నించే వారిపై కేసులు , అరెస్టులు , రాళ్లదాడులు చేయిస్తున్నారని , దీనిపై సమైక్యంగా పోరాడాలని కోరుతూ విపక్ష పార్టీలకు గురువారం నాడు లేఖలు రాశారు. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్యను ప్రతిపక్షాలతో చర్చించాలని అనుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు, ఆందోళనలకు అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఒక పార్టీ అధ్యక్షురాలిగా తననే టోయింగ్ చేయడం దారుణం అన్నారు. రాష్ట్రంలో నెలకొంటున్న తాజా పరిస్థితులపై ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసి వివిరించనట్టు తెలిపారు.షర్మిల ప్రతిపక్ష పార్టీలకు రాసిన లేఖలో బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, కోదండరామ్ ,కాసాని జ్ణానేశ్వర్ ,ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ,అసదుద్దీన్ ఒవైసి ,తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు ,మందకృష్ణమాదిగ, ఎన్.శంకర్‌గౌడ్ పేర్లు ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News