Sunday, January 19, 2025

చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ కానుక

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ద వైఎస్‌ఆర్ ఫ్యామిలీ విషెస్ యూ, ఎ డిలైట్‌పుల్ క్రిస్మస్ అండ్ ఎ బ్లెస్డ్ 2024’ అని రాసి ఉన్న గ్రీటింగ్ కార్డును పంపారు. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో షర్మిలకు ధన్యవాదాలు తెలిపారు. అద్భుతమైన కానుకలు పంపినందుకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు, నారా కుటుంబం తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. షర్మిల పంపిన గ్రీటింగ్, గిఫ్ట్ బాక్స్‌ల చిత్రాలకు లోకేష్ జత చేసి ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News