Monday, January 20, 2025

కాంగ్రెస్‌కు షర్మిల దూరం?!

- Advertisement -
- Advertisement -

ఆ పార్టీ విలీనంపై ఇప్పటివరకు రాని స్పష్టత
ఇరు పార్టీల మధ్య కుదరని ఏకాభిప్రాయం
ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేసేందుకు కసరత్తు

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టిపి విలీనం లేనట్టేనని ఆ పార్టీ వర్గాల సమాచారం. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని ఆపార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 9వ తేదీ నుంచి అన్ని నియోజవర్గాల్లోని ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో పార్టీ వర్గాలు బిజీగా ఉన్నాయి.

షర్మిల రాకను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పాటు ఎపి రాజకీయాల్లో షర్మిలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావించగా అక్కడికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. తెలంగాణ నుంచే రాజకీయాలు చేసేందుకు ఆసక్తిగా చూపిస్తున్నారు. వీటిపై షర్మిల, కాంగ్రెస్ అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. దీంతో సెప్టెంబర్ 30 వరకు కాంగ్రెసుకు షర్మిలకు గడువు విధించగా ఇప్పటివరకు ఆ పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒంటరిగానే ఎన్నికల సమరంలో తలపడ్డాలని షర్మిల తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆమె అనుచరులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News