Friday, December 20, 2024

సిద్ధూ మూసేవాలా హత్య: షార్ప్‌షూటర్ హర్కమల్ రాను అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Moosewala

ఛండీగఢ్: పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో షార్ప్ షూటర్ హర్కమల్ రానును పోలీసులు శుక్రవారం అరస్టు చేశారు. భటిండాలో ఉంటున్న రాను కుటుంబ సభ్యులు తామే అతడిని పోలీసులకు అప్పగించినట్లు చెబుతున్నారు. ఇదిలావుండగా కెనడాలో ఉంటున్న గ్యాంగ్ స్టర్ సతీందర్ సింగ్ ఉరఫ్ గోల్డిబ్రార్ కు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేశారు. అతడికి వ్యతిరేకంగా సిబిఐ జూన్ 2న ఇంటర్ పోల్ కు లేఖ రాసింది. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా కోరింది. స్టూడెంట్ వీసా మీద కెనడా వెళ్లిన బ్రార్ తిరిగి స్వదేశానికి రాలేదు. మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలా కాల్చివేతకు గురైన సంగతి తెలిసిందిే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News