Tuesday, April 29, 2025

‘శర్వా38’లో కీలక పాత్రలో..

- Advertisement -
- Advertisement -

చార్మింగ్ స్టార్ శర్వా తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శర్వా 38’ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గ్రిప్పింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తారు. ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా ప్రకటించిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు కీలక పాత్ర కోసం డింపుల్ హయాతిని ఎంపిక చేశా రు. ఇది ప్రాజెక్ట్‌కు మరింత స్టార్ పవర్‌ని జత చేసింది. ఈ పవర్‌ఫుల్ పాత్రకు ప్రాణం పోసేందుకు డింపుల్ పర్ఫెక్ట్ ఛాయిస్. అనుపమ, డింపు ల్ ఇద్దరూ మంచి పాత్రలను పోషిస్తున్నారు. 1960లో ఉత్తర తెలంగా ణ, -మహారాష్ట్ర సరిహద్దులో సెట్ చేయబడిన ఈ సినిమా ప్రేక్షకులను మరపురాని అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం హై-స్టేక్స్ పీరి యడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News