Sunday, January 12, 2025

మంచి కథ కుదిరితే శ్రీకార్తిక్‌తో మళ్ళీ పని చేస్తా

- Advertisement -
- Advertisement -

శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో హీరో శర్వానంద్ మీడియాతో మాట్లాడుతూ “మేము ఊహించినట్లే సినిమా అందరికీ కనెక్ట్ అయింది. దీంతో ఒక బరువు దిగిందనే భావన కలిగింది. అదే సమయంలో కొత్తగా చేయబోయే సినిమాల గురించి కొంత కంగారు మొదలైంది. శ్రీకార్తిక్ చాలా అద్భుతమైన దర్శకుడు. భవిష్యత్ లో చాలా పెద్ద దర్శకుడు అవుతాడు. కథని చాలా వివరంగా చెప్పాడు. అంత వివరంగా చెప్పాడు కాబట్టే ఈ కథపై, ఆయన ప్రతిభపై పూర్తి నమ్మకం ఏర్పడింది. మంచి కథ కుదిరితే భవిష్యత్‌లో తనతో కలసి మళ్ళీ పని చేస్తా. నాకు అఖిల్ చిన్నప్పటి నుండి తెలుసు. అయితే అమల, నాగార్జునతో ఎక్కువ పరిచయం ఈ సినిమాతోనే మొదలైంది. నిజంగా వాళ్లు నన్ను మూడో కొడుకులానే చూస్తారు. ఈ విషయంలో నేను లక్కీ. ఇక ప్రస్తుతం కృష్ణచైతన్యతో ఒక సినిమా చేస్తున్నా. ఇది పొలిటికల్ డ్రామా. మరో మూడు కథలు ఫైనల్ స్టేజ్‌లో వున్నాయి” అని అన్నారు.

Sharwanand About Oke Oka Jeevitham With Media

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News