Monday, December 23, 2024

రాశీ ఖన్నా, శర్వానంద్ మూవీ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హీరో శర్వానంద్ తన 33వ చిత్రం కోసం అత్యంత ప్రతిభ గల రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్యతో కలసి పని చేస్తున్నారు. నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిర్మాతలు, చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యువి క్రియేషన్స్ వంశీ, విక్రమ్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ముహూర్తం షాట్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్‌బోర్డ్‌ను ఇవ్వగా, కృష్ణ చైతన్య స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది. పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌లో శర్వానంద్‌ని ఇంటెన్స్ క్యారెక్టర్‌లో చూపించనున్నారు కృష్ణ చైతన్య. రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనుండగా, జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

Sharwanand and Rashi Khanna movie opening

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News