Monday, December 23, 2024

అంగరంగ వైభవంగా శర్వానంద్, రక్షిత వివాహం

- Advertisement -
- Advertisement -

హీరో శర్వానంద్, రక్షిత వివాహం చేసుకున్నారు. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకలు రెండు రోజుల ముందు జూన్ 2న మెహందీ, సంగీత్, హల్దీ ఈవెంట్‌తో ప్రారంభమయ్యాయి. నిన్న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లోని విక్రమ్ ఆదిత్య బాల్‌రూమ్‌లో ‘పెళ్లికొడుకు’ వేడుక వైభవంగా జరిగింది.

ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, యువి క్రియేషన్స్ వంశీ, విక్రమ్, దిల్ రాజు కుటుంబం నుంచి ఆశిష్, హర్షిత్, హన్షిత తదితరులు హాజరయ్యారు. శర్వానంద్, రక్షిత తమ పెళ్లి దుస్తులలో అందంగా కనిపించారు. శర్వానంద్ ఆభరణాలతో కూడిన క్రీమ్ పింక్ షేర్వానీ, రక్షిత సిల్వర్ క్రీమ్ కలర్ చీరను ధరించారు. జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో శర్వానంద్, రక్షిత పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News