Thursday, January 23, 2025

శర్వానంద్-రక్షిత రెడ్డి నిశ్చితార్థం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ హీరో శర్వానంద్ తన బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలికారు. హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో శర్వానంద్-రక్షిత రెడ్డికి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు శర్వానంద్ ప్రాణ మిత్రుడు రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసన పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శర్వానంద్ అభిమానులు ఆయన అభినందనలు తెలిపారు. ఒకే ఒక జీవితం సినిమా తరువాత కొత్త ప్రాజెక్టులను గురించి బయటకు రాలేదు. వివాహ వేడుక పనుల్లో బిజీగా ఉండడంతో శర్వానంద్ విరామం తీసుకున్నాడు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురు రక్షితా రెడ్డి. ఎపి మంత్ర బొజ్జల రామకృష్ణా రెడ్డి మనవరాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News