Wednesday, January 22, 2025

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో శశి థరూర్!

- Advertisement -
- Advertisement -

Shashi Tharoor in Congress presidential race

నామినేషన్ పత్రాల సేకరణ..30న దాఖలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ శనివారం ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల కోసం నామినేషన్ పత్రాన్ని ఇక్కడి ఎఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి పొందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30న థరూర్ తన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. నామినేషన్ పత్రాల ప్రక్రియ మొదలైన రోజునే థరూర్ సన్నిహిత అనుచరుడు ఆలిమ్ జవేరి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంస్థ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ కార్యాలయం నుంచి నామినేషన్ పత్రాన్ని తీసుకున్నారని వారు చెప్పారు. కాగా..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో థరూర్ తలపడే అవకాశం ఉంది. తన నామినేషన్‌ను బలపరిచే పార్టీ నాయకుల సంతకాలను దేశవ్యాప్తంగా సేకరించాలని థరూర్ భావిస్తున్నందున ఆయన నామినేషన్ ప్రక్రియ చివరిరోజు సెప్టెంబర్ 30న వాటిని దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని 10 మంది పిసిసి ప్రతినిధులు బలపరచాల్సి ఉంటుంది.

రెండు దశాబ్దాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. తన అభ్యర్థిత్వాన్ని అశోక్ గెహ్లాట్ ఇప్పటికే ప్రకటించారు. థరూర్ కూడా రంగంలోకి దిగనుండడంతో ప్రధానంగా పోటీ వీరిద్దరి మధ్యే ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సోమవారం..పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్న థరూర్ తాను కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆమెకు తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను తటస్తంగా ఉండనున్నట్లు సోనియా గాంధీ ఆయనకు తెలియచేసినట్లు వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో బహుముఖి పోటీ ఉండాలన్న ఆలోచనను సోనియా స్వాగతించారు. అధికారిక అభ్యర్థి ఉండాలన్న ప్రతిపాదనను కూడా ఆమె తోసిపుచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News