Saturday, December 28, 2024

కాలుజారిన శశిథరూర్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ పార్లమెంటులో నడుస్తూ కాలుజారి పడ్డారు. ఆయన కాలు బెణికింది. ఆ తర్వాత నొప్పి కూడా మొదలవ్వడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ ప్రమాదం తర్వాత ఆయన పార్లమెంటుకు నేడు వెళ్లలేదు. పైగా ఆయన తన పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్లే ప్రణాళికను కూడా రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ట్విట్టర్‌లో తన ఫోటోను షేర్ చేశారు.

శశి థరూర్ తన ట్వీట్‌లో వివరించారు. ఓ చిన్న అసౌకర్యం ఏర్పడిందన్నారు. పార్లమెంటులో ఓ మెట్టు మిస్సవడంతో నేను జారిపడ్డాను. నా ఎడమ కాలిలో చాలా ఘోరమైన వాపు చోటుచేసుకుంది. కానీ తాను కొన్ని గంటలపాటు పెద్దగా పట్టించుకోలేదని ఆయన తెలిపారు. ఆ తర్వాత నొప్పి ఎంతగా పెరిగిపోయిందంటే తాను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు. తానిప్పుడు నడవలేనని, తిరగలేనని ఆయన చెప్పుకొచ్చారు. “నేడు పార్లమెంటు సమావేశాలకు నేను వెళ్లడం లేదు. అంతే కాకుండా నేను నా పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్లాలను కున్న ప్రణాళికను కూడా రద్దు చేసుకున్నాను” అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News