Monday, December 23, 2024

కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశిథరూర్ .. సోనియాతో భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అక్టోబర్‌లో జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్… సోనియా గాంధీతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కొందరు యువ కార్యకర్తలు రూపొందించిన ఆన్‌లైన్ పిటిషన్‌కు ఆయన అంగీకారం తెలిపిన అనంతరం ఈ భేటీ జరగడం గమనార్హం. కొద్ది నెలల క్రితం ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చేసిన తీర్మానాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పార్టీకి చెందిన కొందరు యువ నాయకులు ట్విట్టర్‌లో ఓ పిటిషన్‌ను రూపొందించారు. దీనికి మద్దతుగా 650 మంది పార్టీ నాయకులు సంతకాలు చేశారు. దీన్నే ట్విట్టర్‌లో షేర్ చేసి తాను స్వాగతిస్తున్నట్టు శశిథరూర్ తెలిపారు. దీనిపై ప్రచారం చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Shashi Tharoor meets Sonia Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News