Thursday, March 20, 2025

అప్పుడు మోడీ గ్రేట్…. నేను మూర్ఖుడిని: శశిథరూర్

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఎంపి శశి థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఎ ప్రభుత్వాన్ని ఎంపి శశిథరూర్ ప్రశంసించడంమనేది హాట్ టాఫిక్‌గా మారింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు భారత్ వైఖరి పట్ల తాను విమర్శలు చేశానని, ఈ విషయంలో అప్పుడు తానొక మూర్ఖుడినని ఎంపి శశి థరూర్ తెలిపారు. యుద్ధం జరుగుతున్నప్పుడు భారత్ ఎవరి వైపు ఉండలేదని తాను విమర్శలు చేశానని, రెండు వారాల వ్యవధిలో రెండు దేశాధినేతలను పిఎం ఆలింగనం చేసుకొని ఆమోదం పొందరన్నారు. యూరప్ వ్యవహారాల్లో భారత్ ఎక్కువ జోక్యం చేసుకోకపోవడంతో ఇండియా అనేక ప్రయోజనాలు పొందుతుందని కొనియాడారు.

ప్రపంచ వ్యాప్తంగా శాశ్వత శాంతి తీసుకవచ్చే స్థితిలో భారత్ ఉందని ప్రశంసించారు. శశిథరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలలో కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆయన దూరం జరుగుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిఎం మోడీ అమెరికా పర్యటనతో పాటు కేరళ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా చేయాలని అగ్ర నాయకుల కంకణం కట్టుకున్నారు, కానీ సొంత పార్టీలో బిజెపి కోవర్టులు ఉన్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఎన్‌డిఎ ప్రభుత్వ నిర్ణయాన్ని శశిథరూర్ మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News