- Advertisement -
న్యూఢిల్లీ : ఇండియాను భారత్‌గా పేరు మార్చే ప్రభుత్వ విధానంపై కాంగ్రెస్ నేత శశథరూర్ బుధవారం ధ్వజమెత్తారు. “భారత్ ”ను “ ఎలియన్స్ ఫర్ బెటర్‌మెంట్ ,హార్మోనీ, అండ్ రెస్పాన్సబుల్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ టుమారో ( బిహెచ్‌ఎఆర్‌ఎటి) అంటే
అభివృద్ధి, సామరస్యం, రేపటికోసం బాధ్యతాయుతమైన పురోగతికి చెందిన కూటమిగా విపక్షకూటమి అభివర్ణిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్లనైనా అధికార పార్టీ పేర్లుమార్చే క్రూరమైన ఆట అరికడుతుందని ఆశిస్తున్నట్టు ఆయన ధ్వజమెత్తారు. జి20 సదస్సు విందుకు రాష్ట్రపతి పంపిన ఆహ్వానాలపై రాష్ట్రపతి హోదాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు “ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ”అని మార్పు చేయడంపై శశిథరూర్ ఎద్దేవా చేశారు
- Advertisement -