Monday, December 23, 2024

ఉప ఎన్నికలకు టిఎంసి అభ్యర్థులుగా శత్రుఘ్నసిన్హా, బాబుల్ సుప్రియో

- Advertisement -
- Advertisement -

Shatrughan Sinha and Babul Supriyo are TMC candidates for by-elections

 

కోల్‌కతా : లోక్‌సభ ఉప ఎన్నికల్లో అసాన్‌సోల్ నుంచి బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా, బల్లీగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి గాయకుడు బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) టిక్కెట్టుపై పోటీ చేస్తారని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆదివారం వెల్లడించారు. కేంద్ర మాజీ మంత్రి , ప్రముఖ నటుడు శత్రుఘ్నసిన్హా, లోక్‌సభ ఎన్నికల్లో అసాన్‌సోల్ నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని, టీఎంసీ తరఫున ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే బల్లీగంజ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి గాయకుడు బాబుల్ సుప్రియో పోటీ చేస్తారు. జైహింద్, జై బంగ్లా, జై మామాటీమానుష్ అని వరుస ట్వీట్లలో మమతాబెనర్జీ ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News