హైదరాబాద్: సోషల్ మీడియాలో ప్రేమించుకున్నారు… సహజీవనం చేశారు కానీ మరో యువతితో యువకుడికి పెళ్లి నిశ్చయం కావడంతో ప్రియుడిపై ప్రియురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు సంవత్సరాల క్రితం బోరబండకు చెందిన యువతి(27)కి మహారాష్ట్రకు చెందిన సైఫ్ (27) అనే యువకుడు సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయడంతో ఏర్పడడంతో ప్రేమగా ఇద్దరు సహజీవనం చేశారు. 2020లో అమ్మాయికి దుబాయ్‌లో ఉండే యువకుడితో పెళ్లి చేశారు. దుబాయ్ నుంచి ప్రతీ రోజు ఆమె తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడేవారు. ఆమె విడాకులు తీసుకుంటే ఆమెతో కలిసి ఉంటానని సైఫ్ హామీ ఇచ్చాడు. దీంతో భర్తకు విడాకులు ఇచ్చి దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఇద్దరు కలిసి కొన్ని రోజులు సహజీవనం చేశారు. సదరు యువతితో పెళ్లికి సైఫ్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో యువతితో పెళ్లి నిశ్చయం చేశారు. ఆమె ప్రియురాలు తనని మోసం చేశాడని ఎస్‌ఆర్ పోలీస్ స్టేషన్‌లో ప్రియుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విడాకులిచ్చి ప్రియుడితో సహజీవనం… మరో యువతితో పెళ్లి
- Advertisement -
- Advertisement -
- Advertisement -