Monday, December 23, 2024

వివాహిత… ప్రియుడితో లేచిపోయిన ప్రియురాలు… ధర్నా

- Advertisement -
- Advertisement -

She eloped with lover in Siddipet

సిద్దిపేట: ప్రేమించాడు… వివాహితను పెళ్లి చేసుకున్నాడు… ప్రియుడు మోసం చేయడంతో అతడి ఇంటి ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ధర్నా చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాముని పట్ల గ్రామానికి చెందిన యాసరేని సంతోష్ కుమార్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. మూడేళ్ల నుంచి ఓ అమ్మాయి వెంటపడ్డాడు. ప్రేమిస్తున్నామని పెళ్లి చేసుకుంటానని ఆమెను లోబరుచుకున్నాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిని కోరింది. అతడు పలుమార్లు మాట దాటవేయడంతో మరో వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమె సంతోష్‌తో వాట్సాప్‌లో చాటింగ్ చేసేది. తాను మళ్లీ పెళ్లి చేసుకొని మంచిగా చూసుకుంటానని చెప్పడంతో అత్తింటి నుంచి అతడితో పారిపోయింది. ఆమెను కరీంనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. కొన్ని రోజుల తరువాత అతడు    కనిపించకపోవడంతో పాటు ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. దీంతో సంతోష్ కుమార్ ఇంటి ముందు ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News