Saturday, November 16, 2024

ఆమె కీలకం… అన్ని పార్టీల చూపు మహిళా ఓటర్లవైపే..

- Advertisement -
- Advertisement -

అతివలే కేంద్రంగా పథకాలు, మేనిఫెస్టోల రూపకల్పన

సగానికి పైగా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే ఆధిపత్యం

ఐదు జిల్లాల్లో పురుషుల కంటే అత్యధిక ఓటర్లు
సభలు, సమావేశాలకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా పార్టీల ప్రణాళికలు
పరిగణనలోకి కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల ఎన్నికల అనుభవాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. నేపథ్యంలో మహిళలను ఆకర్షించేందుకు వివిధ పార్టీలు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో మూడు మాసాల్లో అ సెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ భవిష్యత్తును తే ల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. పరి శీలకుల అంచనా ప్రకారం ఓటు హక్కు వినియోగంలో పురుషుల కంటే నేడు మ హిళలే చైతన్యవంతంగా ఉన్నారు. అందు కే.. అతివల ఓట్లని గంపగుత్తగా కొల్లగొ ట్టేందుకు అన్ని రాజకీయ పక్షాలు ప్రయ త్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ఇటీవల వి డుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం లో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు- 1,58,71,493, మహిళా ఓటర్లు 1,58, 43,339 ఉన్నట్లు తేలింది. అయితే రా ష్ట్రంలో నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మ హిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో సగానికి పైగా స్థానాల్లో మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. మరో మూడు నెలల్లో ఎ న్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీ య పార్టీలు, పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఇప్పటికే ఓటర్ల జాబితాను తీసుకుని మహిళలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫ లితాలను శాసించే శక్తి మహిళలకే ఉందని ప్రధాన రాజకీయ పార్టీలు గుర్తించాయి. వారు ఎటువైపు మొగ్గు చూపితే అటే విజయం వరించే అవకాశం ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి. ఇంట్లో ఓట్లను కూడా మహిళలు ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో.. గెలుపు, ఓటములు నిర్ణయించేది మహిళలే అనే చర్చ సాగుతున్నది. అభ్యర్థుల గెలుపోటములను వారు ప్రభావితం చేయనున్నారు. మహిళా ఓటర్లలో సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉటుందని, వారిని ఆకట్టుకునేలా పథకాలు ఉంటే నమ్మకంగా ఓట్లు వేస్తారని భావిస్తున్న ప్రధాన పార్టీలు మహిళలను ఆకట్టుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

పెరుగుతున్న అతివల ప్రభావం
ఎన్నికల ప్రక్రియలో మహిళల ప్రాధాన్యం, పాత్ర క్రమంగా పెరుగుతోంది. చరిత్రలో తొలిసారి.. 2019 ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. నాడు 67.2 శాతం మహిళలు ఓటు వేయగా, పురుషుల శాతం 67. ఇటీవల కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికలు మహిళలు కేంద్రంగానే జరిగాయి. కర్ణాటకలో కాంగ్రెస్, బిహార్‌లో జెడియు, తమిళనాడులో డిఎంకె, ఢిల్లీలో ఆప్ గెలుపు నకు అతివల ఓట్ల అవసరాన్ని గుర్తించి పథకాలు ప్రకటించడం గమనార్హం. కర్ణాటకలో మహిళా పథకాలు విజయం అందిం చడంతో తెలంగాణలోనూ అవే తరహా పథకాలు తెస్తామంటూ కాంగ్రెస్ ఇటీవల హామీలు ఇచ్చింది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు మేనిఫెస్టోలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళల ఓట్లను దృష్టిలో పెట్టుకుని నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్.. వంట గ్యాస్ సిలిండర్‌పై రాయితీ.. బస్సుల్లో ఉచిత ప్రయాణం..వంటి పథకాలను ప్రకటించనున్నట్లు సమాచారం.

ఎవరి లెక్కలు వారివే
అధికార బిఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్, బిజెపిలు మహిళలను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అధికార బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికే మహిళల కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్, కెసిఆర్ కిట్, ఆరోగ్య మహిళ, అమ్మఒడి వాహనాలు, వి హబ్, ఒంటరి మహిళలకు పెన్షన్ వంటి పథకాలను బిఆర్‌ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో సగ భాగం మహిళా ఓటర్లు నేపథ్యంలో ఈసారి ప్రకటించే బిఆర్‌ఎస్ మేనిఫెస్టో లో మహిళలకు శుభవార్త వినిపిస్తామని ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు ప్రకటించా రు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మితో ప్రతి మహిళకు రూ. 2,500 ఆర్థిక సాయం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటివి అమలు చేస్తామని ప్రకటించింది. బిజెపి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా మేనిఫెస్టో రెడీ చేసినట్లు తెలిసింది.

సమావేశాలకూ ఎక్కువ మంది మహిళలు వచ్చేలా ప్రణాళికలు
ఇంటింటి కాంగ్రెస్ పేరిట ప్రచారం నిర్వహిస్తున్న సదరు నేతలు ప్రచారంలో ఎక్కువగా మహిళలే ఉండే విధంగా చూస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు ప్రచారానికి, సభలు, సమావేశాలకు ఎక్కువ మంది మహిళలు వచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. వాళ్లయితేనే ఓపిక సహనంతో ఎక్కువ సేపు ఉంటారని, ప్రసంగాలు వింటారనే భావనతో ఎక్కువగా మహిళలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు స్థానిక సంస్థలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు వారిని సమీకరిస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతలు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాటి గురించి ప్రచారంలో భాగంగా మహిళా ఓటర్లను ఆకర్శించే విధంగా మాట్లాడుతున్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకంగా మారనున్న మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News