Wednesday, January 29, 2025

ప్రియుడి కోసం కూతురిని చంపిన తల్లి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రియుడి కోసం కూతురును తల్లి చంపిన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా తన భర్తతో విడిగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఢిల్లీకి చెందని రాహుల్ అనే వ్యక్తి పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ప్రియుడి కోసం హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి మారింది. తన కూతురుతో కలిసి ప్రియుడు రాహుల్ ఇంటికి వెళ్లింది. ప్రియురాలికి కూతురు ఉండడంతో రాహుల్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఆగ్రహంతో రగిలిపోయిన ప్రియురాలు తన కూతురు గొంతు నులిమి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News