Friday, January 24, 2025

తండ్రిని కూతురు హత్య చేసి పోలీసులకు దృశ్యం సినిమా చూపించింది

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దృశ్యం సినిమాలో తరహాలో కూతురు తన ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేసిన సంఘటన కర్నాటకలోని బెళగావిలో జరిగింది. కూతురుకు సహకరించిన తల్లితో పాటు ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుధీర్, రోహిణి అనే దంపతులు బెళగావిలో నివసిస్తున్నారు. సుధీర్ తన ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు స్నేహ అనే కుమార్తె ఉంది. ఆమె మహారాష్ట్రలోని ఓ కాలేజీలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతోంది. కాలేజీలో చదువుతుండగా అక్షయ్ అనే యువకుడిని ప్రేమించింది. కూతురు ప్రేమ విషయం తండ్రికి తెలియగానే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తండ్రి ఉండగా ప్రియుడితో కలిసి బతకలేనని గ్రహించి అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. పథకం ప్రకారం స్నేహ ప్రియుడు అక్షయ్‌ను ఈ నెల 17న బెళగావి రమ్మని కబురు పంపింది. ప్రియుడిని ఓ లాడ్జిలో ఉంచి సమయం కోసం ఎదురుచూశారు.

తండ్రి ఒక్కడే పై అంతస్థులో గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూతరు తన ప్రియుడ్ని ఇంటికి పిలిచింది. అనంతరం తల్లి, కూతురు సుధీర్ కాళ్లను పట్టుకోగా అక్షయ్ కత్తితో అతడి కడుపులో పలుమార్లు పొడిచాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అతడు అక్కడి నుంచి సొంతూరుకు వెళ్లిపోయాడు. తన భర్తను ఎవరో హత్య చేశారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో రోహిణి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎన్ని సార్లు ప్రశ్నించిన దృశ్యం సినిమా తరహాలో తల్లీకూతుళ్లు ఒకే సమాధానం చెప్పారు. డిసిపి రవీంద్ర ఘటనా స్థలానికి చేరుకొని కూతురు పోన్ కాల్ హిస్టరీని చెక్ చేశాడు. స్నేహ పలుమార్లు అక్షయ్ తో మాట్లాడడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తామే హత్య చేశామని ఒప్పుకుంది. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News