Tuesday, November 5, 2024

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌనపోరాటం

- Advertisement -
- Advertisement -

She strike before Lover house in Khammam

 

మన తెలంగాణ/ఖమ్మం: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌనపోరాటం ౩వ రోజు కొనసాగింది. ఎర్రబోడుకు చెందిన కోనం సునీత మండల కేంద్రానికి చెందిన సముద్రాల వేణును గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో మొహం చాటేయడంతో సునీత ప్రియుడి ఇంటిముందు బుధవారం నుంచి మౌన పోరాటం మొదలు పెట్టింది. తనకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆపేదిలేదని సునీత స్పష్టం చేసింది. ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శులు, ధనమ్మ, కొండబోయిన ఉమావతి, ప్రగతిశీల మహిళా అధ్యక్షురాలు వై జానకి, సునీతను కలుసుకుని ఆమెతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల పట్ల రోజురోజుకు దాడులు అధికమవుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News