Monday, December 23, 2024

ప్రేమ… మరో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు.. ప్రియురాలు ధర్నా

- Advertisement -
- Advertisement -

 

కారేపల్లి: ప్రేమించాలని వెంటపట్టాడు.. ఏడేళ్లుగా యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు… రైల్వేలో ఉద్యోగం రావడంతో మరో యువతితో పెళ్లికి సిద్ధంకావడంతో సదరు యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బర్లగూడెం గ్రామానికి చెందిన సునావత్ పరోషన్, అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాలని వెంటపడ్డాడు. దీంతో ఇద్దరు గత ఏడు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నారు. బిటెక్ పూర్తి చేసిన సునావత్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నాడు. రైల్వేలో అతడికి జాబ్ రావడంతో ప్రియురాలు వైపు వెళ్లకుండా ముఖం చాటేశాడు. మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేసుకోవడంతో ప్రియురాలు తనని వివాహం చేసుకోవాలని అతడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. యువకుడి కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News