Saturday, November 23, 2024

మితిమీరిపోతున్న ఈవ్ టీజర్ల ఆగడాలు…

- Advertisement -
- Advertisement -

రాచకొండలో ఈవ్ టీజర్ల అరెస్టు
52 మందిని పట్టుకున్న షీటీమ్స్
25 మంది మేజర్లు, 27 మంది మైనర్లు
సిపి క్యాంపు కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించిన భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు

Eve Teasing

మన తెలంగాణ/సిటీబ్యూరో: యువతులు, బాలికలు, మహిళలను వేధిస్తున్న పోకిరీలపై రాచకొండ పోలీస్ కమిషనర్ షీటీమ్స్ పోలీసులు 52 కేసులు నమోదు చే శారు. ఇందులో 7మందిపై ఎఫ్‌ఐఆర్‌లు, 14 మందిపై పెట్టి కేసులు, 16 మందిపై కేసులు నమోదు చేశారు. పోకిరీలకు భూమిక ఉమెన్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కౌన్సెలింగ్ రాచకొండ సిపి క్యాంపు కార్యాలయ ంలో నిర్వహించారు. సైక్రియాటిస్ట్ డాక్టర్ వాసవి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. రాచకొండ పోలీసులు వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదులు వచ్చినా స్పందించి బాధితులను కాపాడారు. మెట్రోట్రైన్, జంక్షన్లు, బస్‌స్టాప్‌లు, వర్కింగ్ ప్లేస్‌ల్లో బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తున్న పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు.

యువతితో అసభ్య ప్రవర్తన…

Eve Teasing
తండ్రితో కలిసి వెళ్తున్న యువతి పట్ల పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు. హెచ్‌బి కాలనీ, ఈసిఐఎల్‌కు చెందిన యువతి, తన తండ్రితో కలిసి ఈ నెల 7వ తేదీన సాయంత్రం బైక్‌పై బయటికి వచ్చింది. రాయల్ ఫంక్షన్ హాల్ సమీపంలోకి రాగానే మారేడుపల్లి, లాలాపేటకు చెందిన బండి రాకేష్, కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మౌలాలీకి చెందిన చాంగల్‌పత్ నిఖిల్ విద్యార్థి వారి వెనుక బైక్‌పై వచ్చారు. యువతి తండ్రితో కలిసి వెళ్తున్న బైక్ పక్కకి వచ్చి ఒక్కసారిగి గట్టిగా అరిచారు. దీంతో ఇద్దరు భయభ్రాంతులకు గురయ్యారు, ఇద్దరు యువకులను నిలదీశారు. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితులు తండ్రి, కూతురిని భూతులు తిట్టారు. అంతేకాకుండా యువతి మెడపట్టుకుని నెట్టి వేశారు. బాధితులు మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
డెకాయ్ ఆపరేషన్లు…

She-Team

షీటీమ్స్ చౌటుప్పల్‌లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఏడుగురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడలో ఈ నెల 13వ తేదీన నిర్వహించిన ఆపరేషన్‌లో బాలికలకు వేధింపులకు గురిచేస్తున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్‌బి నగర్, షీటీమ్స్ పోలీసులు నాగోల్ జెడ్‌పిహెచ్‌ఎస్ సమీపంలో ఈ నెల 18వ తేదీన నిర్వహించిన ఆపరేషన్‌లో బాలికలను వేధింపులకు గురిచేస్తున్న నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల పరిసరాల్లో తి రుగుతు బాలికలను వేధింపులకు గురిచేస్తున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ని ర్వహించారు. మల్కాజ్‌గిరి టీము ఈ నెల 11వ తేదీన విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ సమీపంలో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. కాలేజీ పరిసరాల్లో తిరుగుతూ యువతులు, బాలికలను వేధింపులకు గురిచేస్తున్నారు. వనస్థలిపురం పోలీసులు మీర్‌పేట, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆరుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. మె ట్రో రైల్వే స్టేషన్ల వద్ద ని ర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో తొమ్మిది మం దిని అదుపులోకి తీసుకున్నారు.
బాల్యవివాహాలను ఆపిన పోలీసులు…

She Teams Canceled Child marriage
బాల్య వివాహాలు చేయడం నేరమని ఎంత గా ప్రచారం చేస్తున్న సమాజంలో కొందరు మారడంలే దు. బాలవివాహాలు చేస్తున్న వారిని రాచకొండ షీటీమ్స్ ఆపివేశారు. చౌటుప్పల్, ఎల్‌బి నగర్ షీటీమ్స్ మూడు బాల్య వివాహాలు ఆపివేశారు. ఇప్పటి వరకు రాచకొండ షీటీమ్స్ పోలీసులు 123 బాల్య వివాహాలను ఆపివేశారు. బాలికలను పునరావాస కేంద్రానికి తరలించారు.
షీ పెట్రోలింగ్….
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా షీ పెట్రోలింగ్‌ను ప్రారంభించింది. ఓఆర్‌ఆర్, మెయిన్ రోడ్డు, జాతీయ రహదారులు, టోల్‌ప్లాజా, నే రాలు జరిగే ప్రాంతాల్లో షీటీమ్స్ పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. ఆపదలో ఉన్న వారు రాచకొండ కంట్రోల్ రూమ్ నంబర్ 9490617111 లేదా డయల్ 100కు ఫోన్ చేయవచ్చని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News