Sunday, December 22, 2024

నిమజ్జనంలో పోకిరి చేష్టలు.. 250కి పైగా కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గణేష్ నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌కు వచ్చిన భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీలపై హైదరాబాద్ షీటీమ్స్ 250కిపైగా కేసులు నమోదు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో గురువారం, శుక్రవారం నిమజ్జనం నిర్వహించారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే మహిళా, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా షీటీమ్స్‌ను రంగంలోకి దింపారు.

షీటీమ్స్ సిబ్బంది మఫ్టీలో ట్యాంక్‌బండ్‌పై తిరుగుతూ మహిళలు, యువతులను వేధింపులకు గురిచేసిన పోకిరీలను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. చాలా చోట్ల న్యూసెన్స్ జరిగినా కూడా ప్రజలకు ఇబ్బంది కలుగవద్దని పోలీసులు వదిలేశారని, సమన్వయంతో పోలీసులు విధులు నిర్వర్తించారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News