రివ్యూ నిర్వహించిన నగర సిపి అంజనీకుమార్
ఆరు నెలల్లో 889 ఫిర్యాదులు
120మంది బేజర్లు, 15మంది మైనర్లు అరెస్టు
హైదరాబాద్: మహిళలు, పిల్లలను వేధింపులకు గురిచేస్తున్న వారిని పట్టుకునేందుకు షీటీమ్స్ ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. నగరంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించిన సిపి అంజనీకుమార్ రివ్యూ నిర్వహించారు. వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు నిర్భయంగా భరోసా కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. నగరంలోని భరోసా సెంటర్‌కు ఈ ఏడాది 889 ఫిర్యాదుల వచ్చాయి. ఇందులో 97మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని తెలిపారు. 22మందిపై పెట్టీ కేసులు, 201 మందికి వార్నింగ్ ఇచ్చారు, 87 కేసులను పోలీష్ స్టేషన్‌లకు రిఫర్ చేశారు. 128మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు, అందులో 120మంది మేజర్లు, 15మంది మైనర్లు ఉన్నారు. మైనర్లకు తల్లిదండ్రు సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఫిర్యాదుల్లో 41 శాతం మంది షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయగా, 30శాతం మంది వాట్సాప్‌ద్వారా, 14శాతం మంది మెయిల్, 12శాతం క్యూఆర్ కోడ్,మిగతా వారు హాక్‌ఐ, ఫేస్‌బుక్, డయల్ 100, ఇతర సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు.