Monday, December 23, 2024

గొర్రెల కాపర్లు ఆర్థికంగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -

కాల్వశ్రీరాంపూర్: మండలంలోని మల్యాల గ్రామంలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా 53 మంది లబ్దిదారుల్లో 20 మందికి గొర్రెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 2వ విడత 840 యూనిట్లు రూ.10.50 కోట్ల విలువగల గొర్రెలను పంపిణీ చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు గొడుగు రాజకొమురయ్య, రైతు సమితి మండల కోఆర్డినేటర్ నిదానపురం దేవయ్య, ఫ్యాక్స్ చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ జిన్నా రామచంద్రారెడ్డి, ఆడేపు రాజు, సుంకం మల్లారెడ్డి, మాదాసు రామచంద్రం,

యాదవ సంఘం నాయకులు గొడుగు మల్లయ్య, కూకట్ల నవీన్, సర్పంచ్ లంక రాజేశ్వరి సదయ్య, ఎంపీటీసీ గడ్డం రామచంద్రం, మాజీ సర్పంచ్ జక్కే రవి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ బూసి సదాశివరెడ్డి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ కామిడి సంధ్య వెంకటరెడ్డి, ఎరబాటి రవి, లెక్కల వేణుగోపాల్ రెడ్డి, లెక్కల శ్రీను, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News