Wednesday, January 22, 2025

గొర్రెల కుంభకోణం నిందితుడు రాంచందర్‌పై సస్పెన్షన్ వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ లై వ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సిఇఒ సబావత్ రాంచందర్‌ను సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్ధక శాఖ ఎండిగా ఉన్న సమయంలో సబావతు రాంచందర్ నిధుల దుర్వినియోగానికి పాల్ప డ్డారన్న ఆరోపణలపై ఈ ఏడాది మే 31న ఎసి బి అధికారులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ కేసులో నిధుల దుర్వినియోగం కేసులో ఎసిబి దర్యాప్తు కొనసాగుతున్న దృష్టా ప్రభుత్వం ఈ ని ర్ణయం తీసుకుంది.గొర్రెల స్కామ్ దర్యాప్తు లో ఎసిబి అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను ఎసిబి అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

రెండవ రోజు మంగళవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండి రాం చందర్ నాయక్, ఓఎస్‌డి కళ్యాణ్ కుమార్‌లను విచారించారు. సోమవారం కస్టడీ విచారణలో రామచందర్ నోరు మెదపలేదు. అలాగే ఓఎస్‌డి కళ్యాణ్ కూడా విచారణకు సహకరించలేదు. గొర్రెల స్కీము యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఎసిబి అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఎవరి ప్రమేయంతో దళారి, భోగస్ కంపెనీతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. రామచందర్, కళ్యాణ్‌లను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించారు. మంగళవారం కస్టడీ విచారణలో రాజకీయ నాయకుల పాత్ర, ఒఎస్‌డి కళ్యాణ్ ఫైల్స్ తరలింపు, కాల్చివేత వీటన్నింటిపై ఎసిబి అరా తీస్తోంది.

కాగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రామ్ చందర్ నాయక్.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్‌లను మూడు రోజులపాటు ఎసిబి కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో సోమవారం వారిని కస్టడీలోకి తీసుకుని అధికారులు విచారించారు. కాగా గొర్రెల స్కామ్‌లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్‌లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించారు. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్‌చందర్ నాయక్ , ఒఎస్‌డి కళ్యాణ్ అరెస్ట్‌తో రూ.700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఎసిబి గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ మోహినూద్దిన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News