Monday, December 23, 2024

వింతగా ప్రవర్తిస్తున్న చైనా గొర్రెలు ( వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

 

గత పది రోజులుగా చైనా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఓ వీడియో మిస్టరీ వీడింది. చైనాలో ఓ గొర్రెల మంద గుండ్రంగా తిరుగుతూ ఉన్న వీడియోను అధికార మీడియా‘ పీపుల్స్ డైలీ’నే తొలుత హైలెట్ చేసింది. దీంతో ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. చైనాకు మరో అనర్థం ముంచుకు రాబోతోందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా నడిచింది. మరో వైపు సర్కిల్ డిసీజ్ అనే వ్యాధి కారణంగానే అవి అలా చేస్తుండవచ్చని శాస్త్రజ్ఞులు అనుమానించారు. కానీ ఇవేవీ కారణం కాదని ఇంగ్లండ్‌కు చెందిన హార్‌ఫ్యూరీ యూనివర్సిటీ శాస్త్రవేత ప్రొఫెసర్ మ్యాట్‌బెల్ అంటున్నారు. చాలా కాలం
గొర్రెలు దొడ్డిలోనే ఉండడం వల్ల అవి అలా ప్రవర్తిస్తూ ఉండవచ్చని ఆయన అంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News