సిరిసిల్ల : జిల్లాలో మహిళలకు, బాలికలకు, విద్యార్థినిలకు అండగా షీటీమ్ సేవలు ఉంటాయని జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ తెలిపారు.ఎవరినైనా వేధింపులకు గురిచేసినట్లయితే వెంటనే జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా డయల్ 100కు ఫిర్యాదు చే’స్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
జిల్లాలో మే నెలలో షీ టీమ్ నెంబర్ ద్వారా 21 ఫిర్యాదులు అందగా షీ టీమ్ సిబ్బంది మహిళలను విద్యార్థినులను వేధిస్తున్న పోకీరీలను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి 01 కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.అవగాహన సదస్సులు నిర్వహిస్తు,హాట్ స్పాట్‌లపై ప్రత్యేక నిఘాను పెడుతున్నట్లు,తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
అలాగే బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని తెలిపారు. బస్టాండ్, విద్యాలయాల్లో అంటించబడిన QR కోడ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తద్వారా తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.పోలీసులు ఎల్లవేళలా మహిళలకు, విద్యార్థులకు, బాలికలకు రక్షణగా ఉంటారని తెలిపారు.