Wednesday, January 22, 2025

పాక్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్?

- Advertisement -
- Advertisement -

సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాని నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వానికి అడుగులు పడుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం రాత్రి సమావేశమైన ముస్లిం లీగ్-నవాజ్(పిఎంఎల్-ఎన్) ప్రధాని అభ్యర్థిగా పార్టీ అధినేత, మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్‌కు బదులుగా అనూహ్యరీతిలో ఆయన సోదరుడు 72 ఏళ్ల షెహబాజ్ షరీఫ్‌ను నామినేట్ చేసింది. దీనికి ముందు పాకిస్తాన్ పీపుల్స్ పారీకి చెందిన ఆసిఫ్ అలీ జర్దారీ, ముత్తాహిదా ఖవామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్‌కు చెందిన మఖ్బూల్ సిద్దిఖితో హెహబాజ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్-లీఖ్వాయిద్‌కు చెందిన షుజాత్ హుస్సేన్ నివాసంలో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై ఒక నిర్ణయానికి వచ్చారు.

పిఎంఎల్‌ఎన్‌కు మద్దతివ్వాలని జర్దారీ, బిలావల్(భుట్టో) నిర్ణయించినందుకు వారికి ధన్యవాదాలని షెహబాజ్ తెలిపారు. దేశ ప్రధాని మంత్రి పదవికి తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు హెహబాజ్ షరీఫ్‌ను పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ నామినేట్ చేశారని పిఎంఎల్‌ఎన్ సమాచార కార్యదర్శి మారియుం ఔరంగజేబ్ తెలిపారు. పిఎంఎల్‌ఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియం నవాజ్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి నామినేట్ చేశారని ఆమె తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పిఎంఎల్‌ఎన్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్న ఇతర పార్టీలకు నవాజ్ షరీఫ్ దన్యవాదాలు తెలిపారు. ఇటువంటి నిర్ణయాల వల్ల దేశాన్ని సంక్షోభం నుంచి బయటకు తెచ్చేందుకు కొత్త ప్రభుత్వానికి సాధ్యపడుతుందని ఆయన తెలిపారు. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్వాసనకు గురైన తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హెహబాజ్ ఇతర పార్టీల మద్దతు దరిమిలా పిఎంఎల్‌ఎన్‌కు మూడింట రెండు వంతులు మెజారిటీ ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News