Wednesday, January 22, 2025

భారత్‌తో శాంతియుత సంబంధాలను పాకిస్థాన్ కోరుకుంటోంది: షెహబాజ్ షరీఫ్

- Advertisement -
- Advertisement -

Shahbaz Sherif

ఇస్లామాబాద్:  పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంగళవారం మాట్లాడుతూ తనను అభినందించినందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. తమ దేశం భారత్‌తో శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. సోమవారం ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది నిమిషాల్లోనే షరీఫ్‌ను మోడీ అభినందించారు.  “భారతదేశం ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుందని, తద్వారా మన అభివృద్ధి సవాళ్లపై దృష్టి పెట్టవచ్చు, మన ప్రజల శ్రేయస్సును మెరుగపరచవచ్చు” అని తెలిపారు.

మోడీకి సమాధానమిస్తూ షరీఫ్ ఇలా ట్వీట్ చేశారు: “పాకిస్తాన్ భారత్‌తో శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుంటుంది. జమ్మూ మరియు కాశ్మీర్‌తో సహా ముఖ్య వివాదాలకు శాంతియుత పరిష్కారం అనివార్యం. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ త్యాగం అందరికీ తెలిసిందే. శాంతిని కాపాడుకుందాం, మన ప్రజల సామాజిక-ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడదాం.”

పాకిస్థాన్ లో  నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ సోమవారం నాడు పాకిస్థాన్ పార్లమెంట్ దేశ 23వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్‌ను ఏకపక్షంగా ఎన్నుకుంది. మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ తన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, వాకౌట్ చేయడంతో… మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ తమ్ముడు షరీఫ్ మాత్రమే రేసులో మిగిలారు.

ప్రధాని హోదాలో సభను ఉద్దేశించి షరీఫ్ తన తొలి ప్రసంగంలో, “మేము భారత్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్నాము, అయితే కాశ్మీర్ వివాదం పరిష్కరించబడే వరకు మన్నికైన శాంతి సాధ్యం కాదు”  అన్నారు. భారతదేశం ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు “తీవ్రమైన మరియు దౌత్యపరమైన ప్రయత్నాలు” చేయనందుకు ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News