Friday, January 3, 2025

ఎల్‌ఒపి అంటే పార్టీ చేసుకునే నాయకుడా?

- Advertisement -
- Advertisement -

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి తరువాత జాతీయ సంతాప దినాల సమయంలో వియత్నాం పర్యటన పెట్టుకున్నందుకు కాంగ్రెస్ నేత, లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఒపి) రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మంగళవారం తూర్పారబట్టారు. రాహుల్ గాంధీకి ఎల్‌ఒపి అంటే ‘లీడర్ ఆఫ్ పార్టీయింగ్’ (పార్టీ చేసుకునే నాయకుడు) అని ఆర్థం కావచ్చునని ఆయన అన్నారు. దేశం సంతాపదినాలు పాటిస్తుండగా విహారయాత్రకు రాహుల్ ప్రాధాన్యం ఇచ్చారని పూనావాలా ఆరోపించారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ‘తండ్రి వంటి వ్యక్తి’గా పేర్కొంటూ ఆయన పట్ల బాహాటంగా అభిమానాన్ని వ్యక్తం చేసిన దృష్టా కాంగ్రెస్ నేత తాజా పనులు ఆయనను అవమానించడమేనని పూనావాలా ఆక్షేపించారు.

‘దేశం సంతాపం పాటిస్తోంది, ఎల్‌ఒపి పార్టీ చేసుకుంటున్నారు. ఆయనకు ఎల్‌ఒపి అంటే పార్టీ చేసుకునే నాయకుడు అని అర్థం. ముఖ్యంగా డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను తండ్రి వంటి వ్యక్తిగా పేర్కొన్నప్పుడు ఆయనకు విహారయాత్ర మరింత ప్రధానం’ అని పూనావాలా అన్నారు. మరొక వైపు రాహుల్‌ను కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ సమర్థించారు. దృష్టి మళ్లించే బిజెపి ఎత్తుగడలు ఇవి అని ఠాగూర్ అన్నారు, ‘ఈ ‘దృష్టి మళ్లింపు’ రాజకీయాలను సంఘీలు ఎప్పుడు మానుకుంటారు? యమున తీరంలో డాక్టర్ సాహెబ్ అంత్యక్రియలకు స్థలాన్ని మోడీ తిరస్కరించిన తీరు, డాక్టర్ సాహెబ్ కుటుంబాన్ని ఆయన మంత్రులు ఇరకాటంలోకి నెట్టిన తీరు హేయనీయం. రాహుల్ ప్రైవేట్ పర్యటన చేస్తుంటే మీకు ఏమి ఇబ్బంది?’ అని ఠాగూర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News