- Advertisement -
బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందూ వర్గాలపై , ఇస్కాన్ సాధువులపై జరుగుతోన్న దాడులకు మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. సనాతన వర్గానికి చెందిన ఆధ్యాత్మిక వేత్త చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా చిట్టగాంగ్‌లో ఆలయంపై దాడి జరగడంతోపాటు ,వివిధ ప్రార్థనా మందిరాల పైనా దాడులు పెరిగాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, శాంతి భద్రతలను రక్షించడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని, హసీనా ఆరోపించారు. దేశంలో మత స్వేచ్ఛతోపాటు, అన్నివర్గాల ప్రజల జీవితాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై హసీనా ఆందోళన వ్యక్తం చేసినట్టు అవామీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
- Advertisement -