Monday, December 23, 2024

అల్లర్లకు అట్టుడుకుతున్న బంగ్లాదేశ్… భయంతో షేక్ హసీనా పరార్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ లో అల్లర్లు సద్దుమణగడం లేదు. ఇప్పటికి కనీసం 300 మందికిపైగా చనిపోయారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కథనం ప్రకారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, తన సోదరి సహా దేశం వదిలిపోయారు. వివిధ దినపత్రికలు కూడా ఇదే విషయాన్ని రాశాయి. బంగ్లదేశ్ ఆర్మీ చీఫ్ వకార్-ఉల్-జమాన్ నేడు సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. బంగ్లాదేశ్ లో సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది.

బంగ్లాదేశ్ వీధుల్లో భీకర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దాంతో మరణాల సంఖ్య 300కు పైగా చేరుకుంది. కానీ ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కర్ఫ్యూ విధించినందుకు వ్యతిరేకంగా నిరసనకారులు ‘లాంగ్ మార్చ్ టు ఢాకా’ పిలుపునిచ్చారు. అంతేకాక వారు ప్రధాని హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక వారు మొబైల్ ఇంటర్నెట్ ను కటాఫ్ చేయడం, ‘సాబటాజ్’ కు దిగడం వంటివి చేస్తున్నారు. ఇదిలావుండగా అక్కడి సైన్యం కొత్తగా నిరవధిక కర్ప్యూను ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News