Friday, December 20, 2024

షేక్ హసీనా ఆయా

- Advertisement -
- Advertisement -

Sheikh Hasina's four-day visit to India

భారత్‌లో నాలుగురోజుల పర్యటన
ప్రధానంగా కుషియారా నదీజల ఒప్పందం
నేడు ప్రధాని మోడీతో కీలక భేటీ

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం నాలుగురోజుల భారతదేశ పర్యటనకు సోమవారం ఇక్కడికి వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన ప్రధానంగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ, అత్యంత కీలకమైన నదీ జలాల పంపిణీ, వ్యాపార వాణిజ్య సంబంధాల ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనాకు ఇక్కడి విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ధర్శన జర్దోష్ , అధికారుల బృందం స్వాగతం పలికింది. మంగళవారం ప్రధాని మోడీతో హసీనా సమావేశం జరుగుతుంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో కూడా బంగ్లా ప్రధాని భేటీ అవుతారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం హసీనాను కొద్ది సేపు కలిశారు. ఆమెకు స్వాగతం పలికారు. ఢిల్లీకి రాగానే షేక్ హసీనా స్థానికంగా ఉన్న నిజాముద్దిన్ ఔలియా దర్గాను సందర్శించారు.

మంగళవారం నుంచి ఆమె అధికారిక పర్యటన విస్తృతస్థాయి చర్చలతో సాగుతుంది. బంగ్లా ప్రధాని తమ పర్యటనలో భాగంగా అజ్మీర్ ప్రఖ్యాత చిష్తీ దర్గాను కూడా సందర్శిస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. హసీనా వెంబడి వచ్చిన బంగ్లాదేశ్ అధికార ప్రతినిధి బృందంలో ఆ దేశ రైల్వే మంత్రి మహ్మద్ నురుల్ ఇస్లామ్ సుజన్, వాణిజ్య మంత్రి టిప్పు మున్షీ, అక్కడి లిబరేషన్ వార్ మంత్రి ఎకెఎం మెజమ్మల్ హక్ ఉన్నారు. ప్రత్యేకించి ఈసారి బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన దశలో ఇరుదేశాల మధ్య కుషియారా నది జలాల పంపిణీ ఒప్పందంపై సంతకాలు ఉంటాయని అధికారిక అజెండాతో స్పష్టం అయింది. నదీ జలాల పంపిణీకి సంబంధించి తాత్కాలిక ఎంఒయు గత నెలలోనే ఇరు పక్షాల మధ్య ఖరారు అయింది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఇంతకు ముందు భారత్‌కు 2019లో పర్యటనకు వచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News