Monday, January 20, 2025

ఎట్టకేలకు షాజహాన్ షేక్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: మహిళలపై అత్యాచారం, భూ కబజ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ గత 55 రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్‌ను గుఉవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖలీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాఖాన్‌లోని ఒక ఇంట్లో తలదాచుకున్న షాజహాన్ షేక్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కొందరు అనుచరులతో కలసి షాజహాన్ షేక్ ఆ ఇంట్లో తలదాచుకున్నట్లు వారు చెప్పారు. అరెస్టు అనంతరం అతడిని బసీర్‌హట్ కోర్టుకు రరలించినట్లు వారు వివరించారు. షాజహాన్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులతోపాటు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) కూడా అరెస్టు చేయవచ్చని కలకత్తా హైకోర్టు ప్రకటించిన 24 గంటల్లోపలే అతడిని పోలీసులు అరెస్టు చేసినట్లు వారు ఎప్పారు. షాజహాన్‌ను 72 గంటల్లో అరెస్టు చేయాలని, అలా చేయని పక్షంలో అందుకు కారణాలు వివరిస్తూ ఒక నివేదికను ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గత సోమవారం రాత్రి ఆదేశించారు.

కాగా, షాజహాన్ అరెస్టుపై గవర్నర్ స్పందిస్తూ సొరంగం చివరన ఎప్పుడూ వెలుతురు ఉంటుందని, ఈ పరిణామాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. కాగా హైకోర్టు మార్గం సుగమం చేసినందునే షాజహాన్ అరెస్టు సాధ్యమైందని అధికార టిఎంసి పేర్కొంది. అయితే బిజెపి మాత్రం షాజహాన్ అరెస్టును పథకం ప్రకారం జరిగిన చర్యగా అభివర్ణించింది. న్యాయపరమైన చిక్కులు ఉన్నందునే షాజహాన్‌ను మొదట్లో అరెస్టు చేయడం సాధ్యపడలేదని టిఎంసి అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ చెప్పారు.

అయితే అతని అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేయడంతో బెంగాల్ పోలీసులు తమ విధిని నిర్వర్తించారని ఆయన తెలిపారు. అతని అరెస్టును వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్ష బిజెపి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర పోలీసుల సామర్ధం తెలిసినందునే ఏడు రోజుల్లో సాజహాన్‌ను అరెస్టు చేస్తామని ప్రకటించామని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News