Monday, December 23, 2024

‘శేఖర్’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

SHEKAR Movie Trailer Released

హైదరాబాద్: గురుడవేగ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన యాంగ్రీ‌మేన్ రాజశేఖర్ తాజాగా నటించిన చిత్రం ‘శేఖర్’.  మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ రిమేక్ గా రూపొందిన ఈ మూవీకి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో రాజశేఖర్ రిటైర్డ్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొద్దిసేపటి క్రితం ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా ముఖ్య పాత్రలో నటించింది. భీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాస్, శివానీ, శివాత్మిక సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. కాగా, మే 20న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.

 

SHEKAR Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News