Thursday, December 26, 2024

లవ్ గంటే మోగిందంట…

- Advertisement -
- Advertisement -

Shekar's First single released

రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ’శేఖర్’. హీరోగా ఆయనకు 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. ‘ఒరేయ్ నీ లవ్ స్టోరీ ఒకటి చెప్పురా‘ అనే వాయిస్ ఓవర్ తో పాట మొదలవుతుంది.

అనూప్ రూబెన్స్ ఇచ్చిన క్యాచీ ట్యాన్‌కి చంద్రబోస్ సాహిత్యంతో ప్రేమ కథని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాటను విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ సంయుక్తంగా ఆలపించారు. ‘లవ్ గంటే మోగిందంట’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

Shekar’s First single released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News