Wednesday, January 22, 2025

ఆ సినిమా రానాతో తీస్తేనే బాగుంటుంది: శేఖర్ కమ్ముల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్‌లో హ్యాపీడేస్, లీడర్ సినిమాలు తీసి మంచి దర్శకుడిగా శేఖర్ కమ్ముల పేరు తెచ్చుకున్నాడు. హ్యాపీడేస్ సినిమా ఏప్రిల్ 19న 2007లో విడుదలైంది. ఈ సందర్భంగా శేఖర్ మీడియాలో మాట్లాడారు. హ్యాపీడేస్, లీడర్ సీక్వెల్‌పై ఆయన స్పందించారు. హ్యాపీడేస్ సినిమా ఎన్ని సార్లూ చూసిన బోర్ కొట్టదని, దాని సీక్వెల్ చేయాలని తనకు అనిపించిన కానీ కథ కుదరడం లేదని వివరణ ఇచ్చాడు. లీడర్ సినిమాకు సీక్వెల్ చేస్తానని, అది కూడా రానాతో చేస్తే మాత్రమే బాగుంటుందని చెప్పాడు. ఆ చిత్రంలో లక్ష కోట్ల అవినీతి గురించి చర్చిస్తే కొందరు ఆశ్చర్యం వ్యక్త చేశారు.

ప్రస్తుత పాలన మరింత దిగజారిందని, సీక్వెల్ రానాతోనే చేయాలి, కానీ కొత్త వారితో చేస్తే పూర్తిగా దెబ్బతింటామని శేఖర్ తెలిపారు. నాగార్జున, ధునుష్‌తో కలిసి కుబేర అనే సినిమా తీస్తున్నానని, అది తాను రాసుకున్న స్టోరీ అని, అందులోని పాత్రలకు ఇద్దరు సెట్ అవుతారని తీసుకున్నానని, కాపీ కథలను తెరకెక్కించడం తనకు కుదరదని, కథ గురించి ఆలోచన రాగానే పని ప్రారంభిస్తానని, కథను సిద్ధం చేసుకోవడం అలస్యం చేసినా సినిమా షూటింగ్ విషయం తొందరగా ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News