వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శేఖర్. ఈ చిత్రాన్ని నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్‌లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 20న గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్భంగా ‘శేఖర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సక్సెస్‌ఫుల్ దర్శకుడు సుకుమార్, ప్రశాంత్ వర్మ, రామజోగయ్య శాస్త్రి, ప్రసన్న కుమార్, సముద్ర ఖని, విజయ్ భాస్కర్, రాజ్ తరుణ్, శివారెడ్డి, రాజ్ కందుకూరి, శివ కందుకూరి, సందీప్ రాజ్, రామసత్య నారాయణతో పాటు చిత్ర బృందం పాల్గొంది.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ “నా జీవితంలో రాజశేఖర్‌తో నిజమైన అనుభవం ముడిపడింది. సినిమాకు సంబంధించి ఆయన పీక్‌లో ఉన్నప్పుఫుడు ఆహుతి, ఆగ్రహం, తలంబ్రాలు, మగాడు, అంకుశం వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చూసి నేను తనకు ఎంతో వీరాభిమానినయ్యాను.అప్పుడే మొట్ట మొదటి సారి సినిమాకు సంబంధించిన ఆర్ట్ ఫామ్ అంటే.. నేను కూడా సినిమాలు చేయగలను అనే నమ్మకం ఇచ్చింది. దీంతో నేను రాజశేఖర్‌ని ఇమిటేట్ చేసి మాట్లాడేవాన్ని. దాంతో మా ఊరిలో నేను చాలా ఫేమస్ అయ్యాను. ఆ తర్వాత నన్ను స్కూల్‌లో తనలా మాట్లాడమనే వారు. అలా నేను కూడా సినిమాల్లోకి రాగలను, ఏమైనా చేయగలను అనే నమ్మకం ఏర్పడింది. ఇలా నాకు సినిమాకు సంబంధించిన లైఫ్‌ను ఇంత అద్భుతంగా మార్చినందుకు రాజశేఖర్‌కి చాలా థాంక్స్.
ఇక ఈ నెల 20న వస్తున్న శేఖర్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ “20న వస్తున్న మా సినిమాను థియేటర్‌కు వచ్చి చూడండి. మా సినిమా నచ్చితేనే.. పదిమందికి చెప్పండి. అప్పుడే మాతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది.ఈ సినిమా కోసం నాకంటే కూడా జీవిత చాలా కష్టపడింది. అనూప్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు”అని తెలిపారు. దర్శకురాలు జీవితరాజశేఖర్ మాట్లాడుతూ “మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాను ఆదరించండి. టికెట్ రేట్స్ పెరగడం వల్ల ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదని విన్నాను. దీంతో మా సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం లేదు”అని చెప్పారు.