Tuesday, January 21, 2025

కొత్త రాజశేఖర్ కనిపిస్తాడు

- Advertisement -
- Advertisement -

యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ హీరోగా జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శేఖర్’ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

మంచి కథతో కూడిన క్రైమ్ థ్రిల్లర్…

‘శేషు’ మినహా తెలుగులో నేను రీమేక్ చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ సాధించాయి. ‘శేషు’ మిస్ ఫైర్ కావడానికి చాలా కారణాలున్నాయి. మిగతావన్నీ నాకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చాయి. రీమేక్ అంటే గ్యారెంటీ హిట్ ఉంటుంది. మలయాళంలో ‘జోసెఫ్’ సినిమా చూడగానే ఈ సినిమా నాకు సరిపోతుందని అనిపించింది. మంచి కథతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. అందుకే ఈ రీమేక్‌ని తెరకెక్కించాము. ఖచ్చితంగా ‘శేఖర్’ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ప్లస్ అవుతుందని ఒప్పించింది…

సినిమాలో నా కూతురు క్యారెక్టర్‌కి శివాని , శివాత్మిక ఇద్దరు వద్దని చెప్పాను. కానీ జీవిత పట్టుబట్టి మీ ఇద్దరు చేస్తే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని రియల్ లైఫ్ ఫాదర్, డాటర్ ఫీల్ కూడా ప్లస్ అవుతుందని నన్ను ఒప్పించింది. ఆ తర్వాత ఇద్దరిలో ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందని చర్చిస్తే శివాని కోసం శివాత్మిక త్యాగం చేసింది. ఇక శివాత్మికతో ఫుల్ లెంత్ సినిమా చేయబోతున్నాను. దానికి కథ సిద్ధమవుతోంది.

కొత్త రాజశేఖర్ కనిపిస్తాడు…

ఈ సినిమా కోసం ఓ కొత్త లుక్ ట్రై చేశాను. 55 ఇయర్స్ ఓల్డ్ క్యారెక్టర్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఫైనల్ చేశాము. సెట్లో అందరూ లుక్ బాగుందని చెప్పేవారు. ఆ లుక్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. రేపు థియేటర్స్‌లో ఆ లుక్‌తో కొత్త రాజశేఖర్ కనిపిస్తాడు.

జీవిత సక్సెస్ అయ్యింది…

ఈ సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. స్క్రీన్ పైకి ఆ ఎమోషన్ తీసుకొచ్చి ఆడియన్స్‌కి సినిమాను కనెక్ట్ చేయడంలో జీవిత సక్సెస్ అయ్యింది. ఇక సెట్స్‌లో ఇద్దరం హీరో, -డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నాం. తనకి ఏం కావాలో అది ఇవ్వడం నా వంతు. నా నుండి ఏం తీసుకువాలో, ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ అవసరమో ఆమె తీసుకుంది. ఎప్పుడైనా సందేహం ఉంటే ఇద్దరం మాట్లాడుకున్నాం.

‘హిట్టు కొట్టావు’ అన్నారు…

నా సినిమాలకు డబ్బింగ్ చెప్పేటప్పుడు సాయి కుమార్ కాల్ చేసి మాట్లాడతారు. ‘గరుడ వేగ’ తర్వాత సాయి కుమార్ మళ్ళీ ఈ సినిమాకు గానూ నా క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పారు. ఆయన ఫోన్ చేసి ‘హిట్టు కొట్టావు’ అని అన్నారు. ఆ మాట విని చాలా సంతోష పడ్డాను. అలాగే సెన్సార్ వారు కూడా ఈ సినిమా చూసి అభినందించారని జీవిత చెప్పింది.

ఫ్యామిలీ అంతా కలిసి…

మా ఫ్యామిలీలోని నలుగురం కలిసి ఓ సినిమా చేయాలనుంది. ఇటీవలే ‘దొరసాని’ దర్శకుడు మహేందర్ ఫ్యామిలీ అంతా కలిసి నటించే స్క్రిప్ట్ చెప్పారు. అలాగే ‘గరుడ వేగ 2’లో ప్రవీణ్ సత్తారు ‘మీ ఇద్దరు అమ్మాయిలను కూడా పెడదాము’ అని అన్నారు. చూడాలి మేము కలిసి నటించే సినిమా ఏది అవుతుందో?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News